చెర“అను? వింటున్నావా నేను చెప్పేది?”

వెనక నుండి అమ్మ మాటలు.

అను మాత్రం అలాగే స్తంభించి వంట గది లో నిలబడి ఉంది. ఎరుపు రంగు పట్టు చీరలో అందంగా ముస్తాబు అయ్యి ఉంది. కానీ తన మొహంలో ఏదో అయిష్టత. తన చూపులు, ఆ గది లోని కిటికీల చెరల నుండి, యెదలోని కారు మబ్బుల సంకెళ్ళ నుండి, పరిగెత్తుకుంటూ బాహ్య ప్రపంచం వైపు ఆశగా చూస్తున్నాయి. తన రెండు చేతులు, వేళ్ళ మధ్యలో హద్దుకొని, నేల వైపు దీనంగా చూస్తూ ఉన్నాయి. కుడి యెడమ బొటన వేళ్ళు ఒకరి గోరుతో ఒకరు యుద్దం చేస్స్తున్నాయి. తన శరీరం తన ఆలోచనలకు అతీతంగా వ్యవహరిస్తూ ఉంది.

అంతలో అమ్మ వంట గది లోనికి వచ్చింది. కిటికీ వద్ద ఉన్న అను వద్దకు వచ్చి, పెదాలపై చిన్న ఆశా పూరితమైన నవ్వును చిందించింది.

“ఇవి తీస్కెళ్ళి హాల్ లో పెట్టు” అంటూ చాయి, సమోసాలు, జిలేబీలతో నిండి ఉన్న ఒక పళ్ళాన్ని అను చేతికి ఇచ్చింది. అను ఆ తినుబండారాలు కూడిన పళ్ళాని తీసుకొని హాల్ లోకి వెళ్ళింది.

హాల్ లో తన బావ కిరణ్ సోఫా లో కూర్చొని ఉన్నాడు.

కిరణ్ తెల్ల చొక్కా, నల్ల రంగు ప్యాంటు లో, కళ్ళకి ఎరుపు రంగు అంచులతో కూడిన అద్దాల జోళ్ళతో, మగవాళ్లే ఈర్ష్య కలిగెంత అందంగా ఉన్నాడు.

ఎడమ వైపు కిరణ్ వాల అమ్మ కూర్చొని ఉంది. ముసి ముసి నవ్వులతో తన మేన కోడల్ని చూస్తూ, తన భర్త మరణం తో విషాదం లో ఉన్న ఇంట్లోకి, తన కొడుకు పెళ్లి ఎన్నో ఆనందాలు తీసుకొస్తుంది అనుకుంటూ మానసిక ఉల్లాసం తో ఉంది.

అక్కడే కిరణ్ కి కుడి వైపున కుర్చీలో కూర్చొన్నా అను నాన్న మర్యాదలో భాగంగా “తీస్కో కిరణ్!” అంటూ అను తెచ్చిన పళ్ళెం వైపు చేయి చూపాడు.

అను కిరణ్ వద్దకు వెళ్ళి, చేతిలో ఉన్న పళ్ళెం తో నడుము వంచింది. కిరణ్ అను ని కొంటెగా చూస్తూ తన కుడి చేయిని పళ్ళెం లో ఉన్న ఒక జిలేబి పై చాపాడు.


తక్షణమే అను ఆ పళ్ళాన్ని కిరణ్ ముందున్న మేజా మీద పెట్టేసి వంట గది లోనికి పరిగెట్టింది. అదే సమయం లో వంట గది నుండి బయటికి వస్తూ అను ని చూసిన అమ్మ “కొత్త కదా! కొంచం కంగారు పడ్తుంది” అంటూ అందరి ఆలోచనలకి కళ్ళెం వేసే ప్రయత్నం చేసింది.

కిరణ్ వాళ్ళ అమ్మ నవ్వుతూ: “కంగారెందుకు? చిన్నపట్టి నుండి చూస్తున్న బావే కదా!”

అను నాన్న తన చెల్లితో - “ నువ్వు కూడా నీ పెళ్లి చూపులప్పుడు ఇలాగే చేశావ్ లక్ష్మి. గుర్తు లేదా?”

ఆ మాటలు విన్న అందరూ నవ్వుకుంటూ ఉన్నారు.

అదే సమయం లో “కిరణ్! చచ్చేదాక మర్చిపోలేని పేరు” అంటూ అను తన అంతరంగ ఆలోచనలను గతం లోకి తీసుకెళ్ళడం మొదలుపెట్టింది.

5 సంవత్సరాళ్ళ క్రిందట!


అను పుష్పవతి అయ్యి 3 నెలలు అయ్యింది. కిరణ్ కూడా తన యువతరాన్ని రెండేళ్ల నుండి ఆస్వాదిస్తూ ఉన్నాడు.


అలా ఒక రోజు అను వాళ్ళ అమ్మ నాన్న ఇంట్లో లేని సమయం లో, కిరణ్ అను గది లోనికి నేరుగా వెళ్లిపోయాడు. అదే సమయం లో కిటికీ చాటున పాటలు వింటున్న అను తన బావ రావడం గమనించలేదు.


కిరణ్ మెల్లిగా అను భుజం మీద చేయి వేశాడు. ఒక్కసారిగా అను ఉల్లిక్కిపడి తిరిగి చూసింది.


“హాయి అను!” అంటూ కిరణ్ అను ని కామం తో చూస్తున్నాడు.


“బావ నువ్వేంటి నేరుగా నా గదిలోకి వచ్చేశావ్?”


“ఒంటరిగా ఉన్నావ్ కదా, తోడుగా ఉందాం అని”


తన బావ చూపులు అను ని ఇబ్బంది పెడుతున్నాయి.

“పర్లేదు బావ. నేను ధైర్యంగానే ఉన్న. నువ్వు వెళ్ళు. అమ్మ నాన్న ఇంకో 10-20 నిమిషాల్లో ఇంటికి వచ్చేస్తారు”


“యే నేను ఇక్కడ ఉండడం నీకిష్టం లేదా?”

“అలా.. ఏం లేదు బావ...” అంటూ అను ఇంకా ఏదో చెప్పేలోపే కిరణ్ ఒక్కసారిగా తన చేతులతో అను నడుమును పట్టుకొని దగ్గరికి లాకున్నాడు. అను కి భయం పెరిగిపోయింది.

“బావ, నీకు దండం పెడతా. నన్ను వదిలేయి” అంటూ తప్పించుకోడానికి ప్రయత్నించింది. కానీ కిరణ్ కామ దాహం అను కన్నీటి విన్నపాలు వినే విచక్షణ లో లేదు.

కిరణ్: “నేను కూడా నీకు దండం పెడతా. ఈ ఒక్కసారి ఒప్పుకో.”

అను కిరణ్ ని గట్టి అక్కడే ఉన్న మంచం మీద తోసేసి బయటికి పరిగెత్తడానికి ప్రయత్నించింది. కానీ కిరణ్ ఆకలి తో ఉన్న మృగంల అను ని వదలలేదు. అను గది నుండి బయటికి అడుగేసెలోపే వెనక నుండి తన జుట్టు పట్టుకొని వెనక్కి లాగి గోడకి నూకాడు. అను మొహం దగ్గరికి వచ్చి కోపం, కామం తో

“నేను చెప్పినట్టు చెయ్! ఎవరికీ తెలీకుండా ఉంటుంది. లేదంటే బయటికి వెళ్ళేది నీ అరుపు కాదు. మీ నాన్న పరువు”

అను కి ఏం చెయ్యాలో అర్దం కాలేదు. నిస్సహాయత నిస్పృహ తో ఏడుస్తూ తల కిందికి పెట్టింది. కిరణ్ అను చున్ని తీసి మంచం మీద వేసాడు.

“అను????” - అమ్మ పిలుపు అను ఆలోచనలను నిలుపేసి వర్తమాన ప్రపంచం లోకి తీసుకొచ్చింది.

అను కళ్ళలో నుండి కన్నీళ్లు జరుతూ ఉన్నాయి.

అమ్మ గట్టిగా కేక వేస్తూ: “అక్కడేం చేస్తున్నావ్? హాల్ లో కి రా!”

అను కన్నీళ్లను తుడుచుకొని తల దించుకొని హాల్ లోకి వచ్చి అమ్మ పక్కన నిలబడింది.

కిరణ్ అమ్మ: “ఈ కాలంలో కూడా ఈలా సిగ్గుపడే అమ్మాయిలు దొరకడం చాలా కష్టం అన్నయ్య”

అదే సమయం లో అను అంతరంగ సంభాషణలు మొదలయ్యాయి.

“తప్పు చేసినవాడు దర్జాగా నా ఇంట్లో నా ముందు మహారాజులా కూర్చొని మాట్లాడుతున్నాడు. తప్పుని 5 సంవత్సరాలుగా మోస్తున్న నేను వాడి ముందు తల దించుకొని నిలబడ్డ.”

“గతమే ఓ శాపంగా, కన్నీళ్ళే నాకు తోడుగా, గుండెలోని భారాన్ని పంచుకోలేని నీశీధిని అయ్యాను”


కిరణ్ అమ్మ: “ ఏం కోడలా? మా అబ్బాయిని పెళ్లి చేస్కుంటావా?”

అను అలాగే తల దించుకొని మౌనంగా నిలబడి ఉంది.

“అను? నిన్నేనమ్మ అడిగేది. కిరణ్ ని పెళ్లి చేస్కోవడం నీకు ఇష్టమే కదా?”